వెస్టిండీస్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పొలార్డ్‌కు కోచ్‌గా ఇదే తొలి సవాల్. విండీస్ అతడి స్వదేశం కావడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే.