రంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : హన్మకొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీ -2 లో చిన్న పిల్లను ఎత్తుకు పొయ్యే ప్రయత్నం కలకలం రేపింది. డాక్టర్స్ కాలనీలోని మసీదు దగ్గరి ఏరియాలో ఒక చిన్న బాబును సంచులు మూటగట్టుకుని పట్టుకుపోతున్న మహిళ కిడ్నాపర్ ను స్థానికులు పట్టుకున్నారు. బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేసే మహిళ బండారం బయట పడగానే మానిసిక పరిస్థితి సరిగా లెన్నట్లుగా నటించి, ఎస్కేప్ కావాలని చూసింది.
4 ఏళ్ళ బిట్టు అనే చిన్నోడి మూతి, చేతులు కట్టేసి ముక్కు మూసి పక్కా పథకంతో సంచిలో వేసుకొని, సంచి ఎవరికి ఇవ్వకుండా పారిపోతుంటే, కాలనీ వాసులు పట్టుకున్నారు.స్థానికుల ఆప్రమత్తతో కిడ్నాప్ కథ సుఖంతమైంది. వరంగల్, హన్మకొండ వాసులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై పోలీసులను సంప్రదిస్తే తమ దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు.