Monday, November 25, 2024

కిక్కు దొబ్బింద‌ట‌..! రూ.3.5 కోట్ల జీతం.. జాబ్‌కు రాజీనామా..!

రీల్ లైఫ్ లో ర‌వితేజా హీరోగా న‌టించిన చిత్రం కిక్ మూవీలో మాదిరిగానే రియ‌ల్ లైఫ్ లో కూడా ఓ వ్య‌క్తి జీవితంలో జ‌రిగింది. జాబ్ దొర‌క్క ఎంతో మంది విద్యావంతులు రోడ్ల‌పై తిరుగుతుంటే.. ఈయ‌న గారికి కిక్కు దొబ్బంద‌ని కోట్ల రూపాయ‌ల జీతాన్ని సైతం కాద‌నుకుని రాజీనామా చేశాడ‌ట‌.. వివ‌రాల్లో వెళితే… అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే ఇంజనీర్ అమెజాన్ సంస్థను వదిలి, 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో చేరాడు. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కంపెనీలో మంచి హోదా. ఏడాదికి మూడున్నర కోట్ల జీతం. ఫ్రీ ఫుడ్, ఇతర అలవెన్సులు. దానితోపాటు అన్‌లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్. అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ, అలాంటి ఉద్యోగాన్ని ఈజీగా వదులుకున్నాడు లిన్. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదని, బోరింగ్‌గా అనిపించిందని, అందుకే జాబ్ మానేశానని చెప్పాడు.
ఎందుకో ఆయ‌న మాట‌ల్లోనే.. క‌రోనా త‌రువాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఒక‌ప్పుడు అంద‌రం క‌లిసి మెలిసి ప‌నిచేసేవాళ్లం.. స‌హోద్యోగుల‌తో గ‌డ‌ప‌డం జ‌రిగింది. నెట్ ప్లిక్స్ లో చేరిన కొత్త ఇంట్రెస్ట్ గానే ప‌నిచేశా. ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రోత్సాహకాలు వంటివి ఆగిపోయాయి.. దీనికి తోడు జాబ్ లో ఎదుగుద‌ల లేదు.. మారనిదల్లా పని మాత్రమే. రోజు చేసిన ప‌నే చేయ‌డం చాలా బోరీ గా ఉంది.. దీంతో పనిని ఎంజాయ్ చేయలేకపోయా. ఇందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రొడక్ట మేనేజ్‌మెంట్‌లోకి మారుదామనుకున్నా. ఇందుకోసం కంపెనీలో చాలా ప్రయత్నించా. కానీ, సాధ్యం కాలేదు. ఒక రోల్ నుంచి మరో రోల్‌కు ఉద్యోగుల్ని పంపించడానికి నెట్‌ఫ్లిక్స్‌ అంగీకరించదు. దీంతో చాలాసార్లు ప్రయత్నించి విసిగిపోయా. డ‌బ్బులు వ‌స్తున్న‌ప్ప‌టికీ కెరీర్ లో ఎలాంటి ఎదుగుద‌ల లేక‌పోవ‌డం చాలా బాధ‌గా అనిపిస్తోంది. అందుచేత‌నే జాబ్ కి రాజీనామా చేశాన‌ని లిన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement