Wednesday, November 20, 2024

జూలైలో మార్కెట్లోకి కియా సెల్టోస్‌ ఫేస్‌లిప్ట్‌ !

సెల్టోస్‌ ఎస్‌యూవీతో భారత్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కియామోటార్స్‌ అత్యంత పాపులర్‌ బ్రాండ్‌గా అవతరించింది. దానికి కొనసాగింపుగా త్వరలో సెల్టోస్‌ ఫేస్‌లిప్ట్‌ మార్కెట్లోకి రాబోతున్నది. సెల్టోస్‌ సింగిల్‌ పేన్‌ సన్‌ రూఫ్‌తోనే మార్కెట్లోకి ఎంటరైంది. కానీ సెల్టోస్‌ సన్‌ రూఫ్‌ మాత్రం.. హ్యుండాయ్‌ క్రెటా మాదిరిగా పూర్తిగా పనోరమిక్‌ సన్‌ రూఫ్‌తో వస్తున్నది. టాప్‌ హై ఎండ్‌ వేరియంట్లలో మాత్రమే పూర్తిస్థాయి పనోరమిక్‌ సన్‌ రూఫ్‌ వ్యూ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

అప్‌డేటెడ్‌ సెల్టోస్‌ ఫేస్‌లిప్ట్‌ కారు న్యూ ఫ్రంట్‌ గ్రిల్లె, న్యూ సెట్‌ ఆఫ్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, రీ డిజైన్డ్‌ బంఫర్‌, న్యూ కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్స్‌, న్యూ సెట్‌ ఆఫ్‌ అల్లాయ్‌ వీల్స్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుత సెల్టోస్‌ కార్లలో 1.5 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లు ఉన్నాయి. కానీ కొత్త సెల్టోస్‌ ఫేస్‌లిప్ట్‌n కారు 1.5 లీటర్ల టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -

ఈ ఇంజిన్‌ గరిష్టంగా 160 పీఎస్‌, 253 ఎన్‌ఎం టార్చి వెలువరిస్తుంది. ఆల్‌ ఇంజిన్లు ఐఎంటీ (క్లచ్‌ లెస్‌ మాన్యువల్‌), ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో రానుంది. సెల్టోస్‌ ఫేస్‌ లిప్ట్‌n ట్విన్‌ 10.25 అంగుళాల డిస్‌ ప్లేలు, డ్యుయల్‌జ్ఖోన్‌ ఆటోమేటిక్‌ ్లకమేట్‌ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌, పవర్డ్‌ టెయిల్‌ గేట్‌, వైర్‌ లెస్‌ చార్జర్‌ ఫీచర్లు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement