- క్వార్టర్ లో ప్రథ్యర్థులు చిత్తు !
ఖోఖో ప్రపంచకప్- 2025లో ఆతిథ్య భారత్ తన జోరు కొనసాగిస్తోంది. అటు మహిళల జట్టు, ఇటు పురుషుల టీమ్ అప్రతిహత విజయాలతో అదరగొడుతున్నాయి. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు తమ విజయపరంపర కొనసాగించి సెమీస్‌లోకి దూసుకెళ్లాయి.
ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వార్టర్స్‌లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌ను 109 -16 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
మరోవైపు ఇక్కడ జరిగిన పురుషుల పోరులో… శ్రీలంకతో తలపడిన భారత జట్టు 100-40 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అమీతుమీ
కాగా, నేటి మహిళల క్వార్టర్స్‌లో తలపడ్డ ఉగాండా, నేపాల్, దక్షిణాఫ్రికా, భారత్ జట్లు…. పురుషుల క్వార్టర్స్‌లో ఇరాన్, నేపాల్, దక్షిణాఫ్రికా, భారత్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఫైనల్స్‌కు చేరాలంటే…. రేపు జరగనున్న సెమీ ఫైనల్స్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు దక్షిణాఫ్రికాతో మహిళల, పురుషుల జట్లతో తలపడనున్నాయి.