కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో అత్యున్నత పురష్కారం అయిన రాజీవ్ ఖేలరత్న అవార్డు పేరును మారుస్తు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరును మారుస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ అవార్డు పేరును మార్చాలని తనకు దేశవ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు అందాయని ఈ సందర్భంగా మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్ట్ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ధ్యాన్ చంద్ ఇండియాకు ఒలింపిక్స్ లో పతకాలు తీసుకువచ్చిన తరువాతనే ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం ప్రారంభమైంది దీంతో… ఇప్పుడు ఇన్నాళ్లకు ప్రతిష్టాత్మకమైన అవార్డు పేరుకు ముందు ధ్యాన్ చంద్ పేరును జోడించారు.
ఇది కూడా చదవండి: అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్..