ఖమ్మం వైద్య విభాగం, ప్రభ న్యూస్ – ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం తిరిగి పరిష్కరించారు. మాతా శిశు కేంద్రo ఎదుట ఉన్న నిలువ మురుగును తక్షమే పరిశుభ్రం చేయాలనీ మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. వైద్యులు ప్రతిక్షణం బాధితులకు అందుబాటులో ఉండాలని వారి పట్ల అసహనం తో మాట్లాడొద్దని, రోగులతో స్నేహపూర్వకంగా ఉండి మెరుగని వైద్యం అందించాలని అన్నారు.
హాస్పటల్లో మందుల కొరత లేకుండా కలెక్టర్ ఆదేశాలు జరిగిన అలాగే వైద్యుల కొరత లేకుండా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారని వైద్యులకు తెలిపారు. అన్నారు. మెడికల్ డిప్యూటీ సూపర్డెంట్ బి కిరణ్ కుమార్ హాస్పిటల్లో 600పడకలకు శాంక్షన్ ఉంటే 450 పడకలే ఉన్నాయని పర్మిషన్ ఉన్నదని అడగగా,6వందల పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.