సూర్యాపేట : కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం.. దేశ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుడుతుంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న ఖమ్మం సభ సక్సెస్ తో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి దేశంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రులు ప్రజలకు విడమర్చి చెప్పారన్నారు. దేశంలో దరిద్రానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. 75 ఏళ్లుగా ఏలిన ఈ రెండు పార్టీలే దేశాన్ని చీకట్లోకి నెట్టాయని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దేశంలో 35 శాతం ప్రజలు ఒక్క పూట అన్నంతో కాలం గడుపుతున్నారన్నారు. ఈ పాపానికి కారణం బిజెపి ప్రభుత్వ విధానాలే అన్నారు. ఆఖలి, దరిద్రం పారద్రోలడమే బీఆర్ఎస్ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. సభను సక్సెస్ చేసి న ప్రతీ ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement