ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ తన గదిలో ఉరికి వేలాడుతుండగా చూసిన విద్యార్ధులు వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే దించి చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.. సెలవులపై ఇంటికి వెళ్లిన సాయి రెండు రోజుల క్రితమే హస్టల్ కు వచ్చినట్లు చెబుతున్నారు.. అత్మహత్య సమాచారాన్ని అతడి పేరేంట్స్ అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement