హిమాచల్‌ప్రదేశ్‌లో ఖలిస్థాన్ జెండాలు, వాల్‌పోస్టర్లు కలకలం రేపాయి. అసెంబ్లి గేటుకు ఖలిస్థాన్ జెండాలు వేలాడదీశారు. గోడలపై ఖలిస్థానీ నినాదాలు రాశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జెండాలు తొలగించారు. గోడలపై రాతలను తుడిచేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అసెంబ్లి గేటు ముందు సీసీటీవీ లేకపోవడంతో, సమీపంలో సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జైరాం ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..