ఖైరతాబాద్ గణపయ్యను దర్శించేందుకు వందలాది మంది భక్తులు నిత్యం వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 40 అడుగుల ఎత్తైన మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపయ్యకు మొదటిసారి తలపాగను ఏర్పాటు చేశారు. తలపాగతో ఖైరతాబాద్ గణపయ్యకు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. బాహుబలి సినిమాకి తలపాగలు తయారు చేసిన చార్మినార్‌కు చెందిన బృందం మహాగణపతికి తలపాగను తయారు చేశారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే విధంగా మహాగణపతికి తలపాగను తయారుచేశారు. ఈ తలపాగతో ఖైరతాబాద్ గణపతి అకట్టుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న చైతూ ‘లవ్‌స్టోరీ’