ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక్క రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. ఆదివారం విగ్రహం ముందున్న కర్రలను తొలగించడంతో భక్తులు చవితికి ముందే దర్శించుకొని సెల్ఫీలతో సంబరపడుతున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా పై యుద్ధం..మహారాష్ట్రలో 144 సెక్షన్