దేశంలోనే ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ మహాగణపతి రేపటి నుంచి పూజలకు సిద్దమయ్యాడు. ఈసారి కూడా మహాగణపతికి 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు.ః
ఇది కూడా చదవండి: ఏపీలో రాజకీయ వేడి.. లోకేశ్ పర్యటనపై హై టెన్షన్