న్యూఢిల్లి : కేఎఫ్‌సీ తన యాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దాని పేరే హౌజ్జాట్.. ఇది ఒక వాయిస్ ఆధారిత ఫీచర్. కేఎఫ్‌సీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని హోమ్ స్క్రీన్‌పై ఉన్న హౌజ్జాట్‌ను క్లిక్ చేయాలి. మీరు ఎంత బిగ్గరగా హౌజ్జాట్ అని అరుస్తారో.. అంతే మంచి ఆఫర్ మీ ఆర్డర్‌కు వర్తించబడుతుంది. ఐసోబార్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయబడింది. హౌజ్జాట్ ఫీచర్.. మే 29 వరకు కేఎఫ్‌సీ యాప్‌లో అందుబాటులో ఉంటుందని, ప్రతీ ఒక్కరు ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని ఆఫర్ పొందాలని కేఎఫ్‌సీ ఇండియా సీఎంఓ మోక్ష చోప్రా తెలిపారు.
క్రికెట్ మ్యాచ్‌లకు కేఎఫ్‌సీ ఎప్పటికీ అండగా ఉంటుందని అందరికి తెలుసని, అయితే దీన్ని ఓ స్థాయికి తీసుకెళ్లామని, డెసిబుల్ ఆధారిత ఫీచర్.. క్యూఎస్‌ఆర్ కేటగిరిలో మొదటిదని తెలిపారు. అభిమానులు హౌజ్జాట్ అని అరిస్తే.. తగ్గింపు అంతే ఉంటుందన్నారు. ఐసోబార్ అండ్ ట్యాప్‌రూట్ ఇండియా సీసీఓ అలప్ దేశాయ్ మాట్లాడుతూ.. పెరుగుతున్న డిజిటల్ మార్కెటింగ్లో.. వాయిస్ మార్కెటింగ్ కూడా ఓ భాగమని, కేఎఫ్‌సీతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాప్ వినియోగదారులు.. కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేసేటప్పుడు.. చాలా సరదాగా.. ఉండేలా చూడాలనుకున్నామన్నారు. సాంకేతికతను ఉపయోగించి.. ఈ డిస్కౌంట్‌లను గెలుపొందొచ్చన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..