దేశ వ్యాప్తంగా సిగ్నేచర్ అభిరుచిని పురస్కరించుకుని.. కేఎఫ్‌సీ బకెట్ కాన్వస్ ప్రచారంతో.. కేఎఫ్‌సీ ఇండియా 600 రెస్టారెంట్లను బలోపేతం చేయడంలో కీలకంగా నిలిచిందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మోక్ష్ చోప్రా అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న యువ కళాకారులు కలిసి కేఎఫ్‌సీ బకెట్‌ని కేఎఫ్‌సీ బకెట్ కాన్వస్‌గా మార్చిందన్నారు. ప్రతీ నగరానికి ఓ యూనిక్ డిజైన్ కలిగి ఉందని తెలిపారు. వివిధ నగరాల్లోని కళ, వాస్తు శిల్పంతో పాటు సాంస్కృతిక అంశాల నుంచి ప్రేరణ పొందిన 150 పరిమిత ఎడిషన్ డిజైన్‌లు రెస్టారెంట్స్‌లో ప్రదర్శించబడుతున్నాయన్నారు. కస్టమర్లు, కేఎఫ్‌సీ రెస్టారెంట్స్ వచ్చిన సమయంలో.. వివిధ నగరాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను గురించి తెలుసుకునే వీలుంటుందని తెలిపారు.
భారతదేశంలో కేఎఫ్‌సీకి ఇది అద్భుతమైన ప్రయాణం అని, తమ బ్రాండ్ ఇప్పుడు 150కు పైగా నగరాల్లో అందించడం జరుగుతోందన్నారు. 600 రెస్టారెంట్లు సేవలు అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కేఎఫ్‌సీ బకెట్.. వారి ప్రతిభను ప్రదర్శించడానికి, 150 ప్రత్యేక డిజైన్‌లు.. భారత్‌లోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతను సజీవంగా తీసుకురావడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ప్రతిభకు ఇది నిదర్శనం అని, వీటిని ఆన్‌లైన్‌లో లేదా రెస్టారెంట్స్‌లో చూసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంతో జనాదరణ పొందిన రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు చారిత్రక కట్టడం చార్మినార్‌లు కేఎఫ్‌సీ బకెట్‌పై కనిపిస్తాయి. వర్ధమాన కళాకారిణి గోపికా గోపకుమార్ కీలక పాత్ర పోషించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..