తాజాగా కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డికి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలకపదవిని కట్టబెట్టనున్నారట. కోమటిరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని చేపట్టిన నాటి నుంచి ఆయన పట్ల వ్యతిరేకతతో ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మేరకు అధిష్టానం బుజ్జగింపుల పనిలో పడింది. పలువురికి కీలక పదవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.
కాగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. తమ సలహాలు తీసుకోకుండానే రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారని కొందరు సీనియర్లలో అసంతృప్తి ఉంది. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కు కూడా కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు ఎఐసీసీలో కొంతమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జాతీయాంశాలపై ఆందోళనలు చేపట్టేందుకు కమిటీని చేసిన సోనియా గాంధీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా దిగ్విజయ్ సింగ్ను నియమించగా..ఈ సభ్యుల్లో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. పీసీసీ చీఫ్ కోసం పోటీ పడిన మాజీ ఎమ్మల్యే వంశీచందర్‌రెడ్డికి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కార్యదర్శిగా నియమించింది. టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది.