Tuesday, November 26, 2024

Delhi | ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పురోగతి.. నోయిడాలో సీఐడీ సోదాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ మరో అడుగు ముందుకు వేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 49లో శనివారం ఏపీ సీఐడీ సోదాలు జరిపింది. రూ. 3,300 కోట్ల ఈ కుంభకోణంలో సీఐడీ బృందం వేగంగా దర్యాప్తు జరుపుతోంది. యూపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారిణి అపర్ణ భర్త జీవీఎస్ భాస్కర్‌ను సీఐడీ అధికారులు ఇదివరకే అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆమె ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేశారు.

- Advertisement -

అపర్ణ స్కిల్ డెవలప్‌మెంట్ విభాంగంలో ఉన్న సమయంలో ఈ స్కాం చోటు చేసుకుంది. ప్రోగ్రామ్ ప్రాజెక్ట్‌ ధరను పెంచడంలో అపర్ణ భర్త భాస్కర్‌ది కీలకపాత్ర అని సీఐడీ అనుమానిస్తోంది. భాస్కర్ ప్రోగ్రామ్ ధరను రూ.3300 కోట్లుగా ప్రభుత్వానికి చూపించి రూ.371 కోట్లు కొట్టేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. అరెస్ట్ అయిన భాస్కర్ ఇచ్చిన సమాచారం అధారంగా సీఐడీ నోయిడాలో అధికారులు దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఏం లభ్యమయ్యాయనేది తెలియాల్సి ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement