Wednesday, November 20, 2024

TS | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ.. కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు

జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

వడ్లకు రూ.500 బోనస్‌…

రాష్ట్ర అవతరణ వేడుకలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఈ స‌మావేశంలో చర్చించారు. ధాన్యం సేకరణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి ధాన్యం గింజ‌ వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే సన్న వడ్ల‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

ఎన్డీఎన్ఏ నివేదిక ఆధారంగానే చర్యలు..

- Advertisement -

అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నడపాలని నిర్ణయించాం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తులపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. మేడిగడ్డపై ఎన్డీఎన్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టుపై చర్చించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్డఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. వర్షాకాలంలో గేట్లు తెరిచి ఉంచాలని.. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండకూడదని ఎన్డీఎస్‌ఏ సూచించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement