కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష, ఆన్‌లైన్ విచారణపై జడ్జిలకు విచక్షణాధికారాన్ని ఇచ్చింది. ప్రత్యక్ష విచారణ చేపడితే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital