- ఇంటర్నల్ మార్కులు రద్దు
- 100 మార్కులతో ఫైనల్ పేపర్
- ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.
కాగా, ఇప్పటివరకు ఇంటర్నల్కు 20 మార్కులు కేటాయించగా.. 80 మార్కులతో పదోతరగతి ఫైనల్ పరీక్షలను నిర్వహిచేవారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి.