Sunday, November 24, 2024

రషీద్ తన కుంటుంబం కోసం ఆందోళన చెందుతున్నాడు: కెవిన్ పీటర్సన్

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు ఘోరంగా తయరయ్యాయి. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ ఆక్రమించాయి. దీంతో 20 ఏళ్ల కిందటి పరిస్థితి వచ్చేస్తుందని ఆ దేశ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ప్రజల దిక్కుతోచని స్థితిలో దేశ దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తు ప్రణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక తమ దేశంలో పరిస్థితిపై ఇప్పటికే ట్వీట్ చేశాడు ఆ దేశ యువ క్రికెటర్ రషీద్ ఖాన్. ఇక రషీద్ ఖాన్ తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఆఫ్ఘాన్‌లో ఉన్న తన కుటుంబాన్ని దేశం నుంచి బయటకు రప్పించలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ (హెచ్‌కేఐ) విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రషీద్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ప్రారంభ ‘హండ్రెడ్’ ఎడిషన్‌లో ట్రెంట్ రాకెట్స్ తరపున ఆడుతున్నాడు.

రషీద్‌ స్వదేశంలో ప్రస్తుతం చాలా విషయాలు జరుగుతున్నాయని, ఇక్కడ తాము ఆ విషయాల గురించి మాట్లాడుకుంటున్నామని పీటర్సన్ పేర్కొన్నాడు. స్వదేశంలోని పరిస్థితులపై రషీద్ ఆందోళన చెందుతున్నాడని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తన కుటుంబాన్ని దేశం దాటించలేకపోవడం ఆవేదన చెందుతున్నాడని అన్నాడు. రషీద్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అన్నాడు. అయితే, ప్రస్తుతం ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగగలడని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఉపాధి బిల్లుల విషయంలో కేంద్రానికి లేఖ రాసిన రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement