Wednesday, November 20, 2024

Kerala – వ‌యానాడ్ లో ప్రియాంకా గాంధీ నామినేష‌న్

సోద‌రుడు రాహుల్ రాజీనామాతో ఉప ఎన్నిక‌
భారీగా నామినేష‌న్ ర్యాలీ
పాల్గొన్న సోనియా, రాహుల్, ఖ‌ర్గే
వ‌య‌నాడ్ ప్ర‌జ‌లే త‌న కుటుంబం అన్న ప్రియాంకా
సోద‌రిని అశీర్వ‌దించాల‌ని అభ్య‌ర్ధించిన రాహుల్

వ‌యానాడ్ – వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు వయానాడ్ కల్ఫేటాలో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి మెగా ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్న ఖర్గే సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వ‌య‌నాడ్ ప్ర‌జ‌లే నా కుటుంబం.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో ప్రియాంకా మాట్లాడుతూ, వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల కంటే త‌న‌కు ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగారని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉండేందకు తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలతో కలిసి పోరాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి వయనాడ్‌కు వచ్చినట్లు తెలిపారు. వయనాడ్ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.

- Advertisement -

సోద‌రిని ఆశీర్వ‌దించండి – రాహుల్ గాంధీ…

వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంకగాంధీని ఆశీర్వదించాలన్నారు రాహుల్ గాంధీ. వయనాడ్ నుంచి అధికారికంగా ఒకరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తే మరొకరు అనధికారికంగా వయనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. ఇక్కడి ప్రజల కోసం తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానన్నారు. తన తల్లి ఇక్కడ ఉన్నారని, తండ్రి చనిపోయిన తర్వాత తన సోదరి ప్రియాంక గాంధీ అమ్మను చూసుకుంటున్నార్నారు. ప్రియాంక 17 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిందని, అయినప్పటికీ తమ తల్లికి తోడుగా నిలిచిందని రాహుల్ తెలిపారు

ప్రియాంకగాంధీ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలే ప్రియాంక కుటుంబమన్నారు. ఆ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలకు తన సోదరిని అప్పగిస్తున్నానని, ప్రియాంక గాంధీని ఇక్కడి ప్రజలే రక్షించుకోవాలన్నారు. అనధికార ఎంపీగా తాను కూడా తరచూ వయనాడ్‌కు వస్తుంటానని రాహుల్ గాంధీ తెలిపారు.

సోదరుడి రాజీనామాతో …

రాహుగాంధీ రాయ్ బరేలీ, వయానాడ్ లో రెండు చోట్ల లోక్ సభ ఎన్నికల్లో గెలవడంతో ఆయన వయానాడ్ స్థానానికి రిజైన్ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక‌ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామాతో వయానాడ్ బరిలో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి..ఇక ప్రియాంకకి యూడీఎఫ్ సపోర్ట్ ఇస్తుంది. వయానాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో భాగంగా నవంబర్ 13న పోలింగ్, 23న తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎల్డీఎఫ్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా సత్యన్ మొఖేరీ, బీజేపీ క్యాండిడెట్ గా నవ్య హరిదాస్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్క‌డ త్రిముఖ ఫైట్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement