Friday, November 22, 2024

‘ది కేరళ స్టోరీ’ పై స్టేకు కేరళ హైకోర్టు నిరాకరణ.. నిరసనల మధ్య చిత్రం విడుదల

వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై స్టే విధించడానికి కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. రాష్ట్రంలో తీవ్రమైన నిరసనల మధ్య చిత్రం విడుదల నేపథ్యంలో హైకోర్టు పై తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో కొన్ని థియేటర్లలో చిత్ర ప్రదర్శనను రద్దు చేశారు. లౌకిక కేరళ సమాజం ఆ చిత్రాన్ని ఆమోదిస్తుందని జస్టిస్‌ ఎన్‌ నగరేష్‌, జస్టిస్‌ మహమ్మద్‌ నియాస్‌ సీపీలతో కూడిన డివిజన్‌ ధర్మాసనం పేర్కొంది.

”చిత్రాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఎలాంటి ఉపద్రవం ముంచుకురాదు. చిత్రం టీజర్‌ నవంబర్‌ మాసంలో విడుదలైంది. అభ్యంతరకరమైనది ఏముంది చిత్రంలో? అల్లా మాత్రమే దేవుడు అని చెప్పడంలో తప్పు ఏముంది? వారి మతాన్ని విశ్వసించి, వారు పూజించే దేవుడిని గురించి ప్రచారం చేసుకునే హక్కును పౌరులకు కోర్టు ప్రసాదించింది. ట్రైలర్‌లో అభ్యంతరకరమైనది ఏముంది?” అని పిటిషనర్లను ప్రశ్నించిన ధర్మాసనం.. చిత్ర ప్రదర్శనపై స్టే విధించడానికి నిరాకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement