Tuesday, November 26, 2024

కొవిడ్ సర్టిఫెకెట్ పై ప్రధాని ఫొటో ఉండొచ్చు.. అది ప్రకటన కిందకు రాదన్న కేరళ హైకోర్టు

కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లపై ప్రధాని మోడీ ఫొటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు.  ఈ వివాదాస్పద అంశంపై పిటిషన్ ను స్వీకరించేందుకు కేరళ హైకోర్టు అడివిజన్ బెంచ్ అప్పీల్‌ను తిరస్కరించింది. అంతకుముందు సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. కాగా, అప్పీలుదారుని తప్పుపట్టింది కోర్టు.- అతనిపై భారీ జరిమానా విధించేంత వరకు వెళ్లింది.

ఇవ్వాల ఈ పిటిషన్‌ను తిరస్కరించిన కేరళ హైకోర్టు  ప్రధాని ఫొటోల వినియోగాన్ని ప్రకటనగా పరిగణించలేమని పేర్కొంది. టీకాలకు సంబంధించి సందేశం ఇచ్చే హక్కు దేశ ప్రధానికి ఉందని కోర్టు పేర్కొంది. కాగా, సింగిల్ బెంచ్ కూడా ఇంతకుముందు ఈ రిట్ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఇది పనికిమాలిన చర్యగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement