Friday, November 22, 2024

Kerala – రోడ్డుపైనే బైఠాయించిన గ‌వ‌ర్న‌ర్ …

తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్ అనూహ్యంగా వ్యవహరించారు. తన కారు దిగి, రోడ్డుపక్కన ఒక షాపు ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ కొల్లాం జిల్లాలో నిర‌స‌న‌కు దిగారు…


వివ‌రాల‌లోకి వెళితే గవర్నర్‌ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా, అధికార సీపీఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలపడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. ఆయన వెంటనే కారు దిగి, దగ్గర్లోని షాపు నుంచి కుర్చీ తీసుకొని రోడ్డుపక్కన వేసుకొని కూర్చున్నారు. ఈ సమయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. కేరళలో గవర్నర్‌, సీఎంల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement