Friday, November 22, 2024

Kerala – పేలిన బాణాసంచా – 150 మందికి పైగా గాయాలు

కేరళలోని కాసర్‌గఢ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున బాణా సంచా నిల్వ చేయడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు ఎనిమింది మరిస్థితి విషమించగా మరో 150 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.

. .ఈ ప్రమాదం అర్ధరాత్రి చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బాణసంచా పేలుడులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు స్థానికులు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు.

అధికారుల ప్రకారం కాసర్‌గాఢ్ నీలేశ్వేరం ఆలయంలో కాళీయపట్ట ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అర్థరాత్రి 12 గంటలు దాటింది. ఇప్పటికే చాలామంది జనం గుడి పరిసర ప్రాంతాల్లో గుమిగూడారు. తియ్యంకోలం చూడటంలో మునిగి పోయారు. ఆలయ వేడుకల్లో భాగంగా పటాకులు పేల్చారు. వీటి నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే నిబంధనలు విరుద్ధంగా నిల్వ చేసిన బాణసంచాపై పడింది.

- Advertisement -

దీంతో ఒక్కసారిగా జరిగిన పేళుళ్లకు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఉరుకులు, పరుగులు తీస్తూ కేకలు వేశారు. అప్పటికే పరిస్థితి విషమించింది. మంటల్లో ఒక్కసారిగా అలుముకోవడంతో ఎనిమిందికి 80 శాతంపైగా గాయాల అయ్యాయి. 150 మందికి పైగా తీవ్ర గాయాల పాలు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement