Wednesday, November 20, 2024

Kuwait Fire : కువైట్‌ అగ్నిప్రమాద మృతులకు కేరళ సీఎం నివాళులు

కువైట్‌ నుంచి 45 మంది భారతీయుల భౌతికకాయాలతో బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన విమానం కేరళకు చేరుకున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మృతుల భౌతికకాయాలకు కేరళ సీఎం పినరయి విజయన్‌ నివాళులర్పించారు. ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం.. అక్కడ మృతదేహాల వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. సీఎంతో పాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఇతర అధికారులు కూడా నివాళులర్పించారు. మరోవైపు విమానాశ్రయంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శవపేటికల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement