Tuesday, November 26, 2024

కేరళ బోట్ ప్రమాదం లో 22 కి పెరిగిన మృతుల సంఖ్య

కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

”కేరళలోని మలప్పురంలో పడవ ప్రమాదంలో పలవురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించబడుతుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఇక, మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తూవల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం పర్యాటకులను తీసుకువెళుతున్న హౌస్‌బోట్ బోల్తా పడింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మరో 8 మందిని రక్షించగా.. వారికి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement