Friday, September 20, 2024

2022 సంవత్సరానికి అవార్డులు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ.

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర సాహిత్య అకాడమీ 2022వ సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 22 మంది రచయితలకు అకాడమీ పురస్కారాలు ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన సాహితీవేత్త పత్తిపాక మోహన్‌ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. బాలల తాత బాపూజీ గేయకథ రచనకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహితీ విమర్శకులు పత్తిపాక మోహన్ చేనేత కుటుంబంలో జన్మించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పల్లిపట్టు నాగరాజు యువపురస్కారానికి ఎంపికయ్యారు.

ఆయన రాసిన “యాలై పూడ్సింది” కవితా సంపుటికి ఈ గౌరవం దక్కింది. మొత్తం 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలను ప్రకటించింది. భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను 1954లో ప్రారంభించారు. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలకు చెందిన సాహితీవేత్తలకు ప్రతిఏటా పురస్కారాలను అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement