Friday, November 22, 2024

Delhi: స్వతంత్ర వేడుకలపై… లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ…

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. తాను జైల్లో ఉన్న కారణంగా ఆగస్ట్ 15న జరగనున్న స్వతంత్ర వేడుకల్లో తన స్థానంలో మంత్రి అతిశీ జెండా ఎగురవేస్తారని లేఖలో పేర్కొన్నారు. ఆయన జైలు నుంచే ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జైలు అధికారులు ముఖ్యమంత్రి చర్యలను ఖండించారు. ఆయన జైలు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను మాత్రమే లేఖలో పేర్కొనవలసి ఉంటుందని, కానీ కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాశారని జైలు అధికారులు తెలిపారు. అందులో స్వాతంత్ర వేడుకల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, అందుకే ఈ లేఖ బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఈ లేఖ లెఫ్టినెంట్ గవర్నర్‌కు చేరుకోలేదు. కానీ అందులోని విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

కేజ్రీవాల్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జైలు నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విషయమై తమకు మెయిల్ అభ్యర్థన పంపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement