Friday, September 20, 2024

Delhi | సీఎం ప‌ద‌వికి కేజ్రీవాల్ రాజీనామా…. లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ !

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన వెంట ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి, ఇతర మంత్రులు, ఆప్ నేతలు ఉన్నారు.

ఆప్ ఎల్పీగా ఆతిషీని ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ ఎల్జీకి తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక.. త్వరలోనే ఢిల్లీ నూతన సీఎంగా ఆతిషీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement