ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, తాజాగా (శుక్రవారం) తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల అయ్యిరు. ఈ క్రమంలో పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేజ్రీవాల్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆమె కూతురు… అదేవిధంగా పంజాబ్ సీఎం మాన్ కూడా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనను విడుదల చేయాలని కోరుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైళ్లు తనను బలహీన పరచలేవని, జైలుకెళ్లడం వల్ల తన ధైర్యం 100 రెట్లు పెరిగిందన్నారు. దేవుడు చూపిన బాటలో పయనిస్తూ దేశానికి సేవ చేస్తాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని సీఎం కేజ్రీవాల్ అన్నారు. అనంతరం తీహార్ నుంచి చేస్తూ తన ఇంటికి వెళ్లారు.