ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు ఆయన మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అక్రమమని ఈడీకి ఆయన జవాబిచ్చారు.
ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతినిజాయితీలతో జీవిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. నవంబర్ 2న విచారణకు రమ్మని పిలవగా.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం ఇప్పించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అప్పుడు విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులు వాపస్ తీసుకున్న ఈడీ.. తాజాగా గురువారం (ఈ నెల 21న) విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు పంపింది. అయితే, ఈసారి కూడా ఆయన విచారణకు వెళ్లలేదు.