Wednesday, November 20, 2024

Delhi : కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది … మంత్రి అతీశీ ట్వీట్‌…

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ/ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్‌ ‘వేదికగా జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ తెలిపారు.

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్‌) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉ‍న్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్‌ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్‌ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే తీహార్‌ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్‌ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్‌ బరువు తగ్గలేదని చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్‌ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్‌ లెవల్స్‌ కుడా నార్మల్‌గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్‌ యోగా, మెడిటేషన్‌ చేస్తున్నారని అ‍న్నారు. ఆయకు కేటాయించిన సెల్‌లో కేజ్రీవాల్‌ నడుస్తున్నారని చెప్పారు.

ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్‌ కేజీవాల్‌ను సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైలు పంపిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 15ను వరకు కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement