Thursday, September 19, 2024

Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్..

( ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ) : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరు నెలల తరువాత బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ట్రయల్ కోర్టు విచారణ హాజరుకావాలని స్పష్టం చేసింది. సాక్ష్యాలను టాంపర్ చేయకూడదని షరతులు విధించింది. దాదాపు 6 నెలల తర్వాత ఢిల్లీ సీఎం జైలు నుంచి బయటకురానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఈడీ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్కి ఇప్పటికే బెయిల్ లభించింది.

కండీషన్డ్ బెయిల్ …

ధర్మాసనం బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్పై సర్వోన్నత న్యాయస్థానం పలు ఆంక్షలు విధించింది. ఆయన సీఎం కార్యాలయానికి, సెక్రటేరియట్కి వెళ్లకూడదని, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఏ ఫైల్పై సంతకం చేయకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని, సాక్షులను కలిసేందుకు ప్రయత్నించకూడదని కేజ్రీవాల్కి ఆదేశాలిచ్చింది.

ట్రయల్ ప్రాసెస్ శిక్ష కాదు

సుప్రీం బెంచ్ వ్యాఖ్యలు

- Advertisement -

కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ ముగించిన అనంతరం ఈ నెల 5న సుప్రీంకోర్టు ఈ తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో పాటు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస సూర్య కాంత్లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రాసిక్యూషన్, ట్రయల్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద శిక్షగా మారకూడదు. ఈ విషయాన్ని అన్ని కోర్టులు పాటించాలి,” అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. అంతేకాదు కేజ్రీవాల్ని సీబీఐ అరెస్ట్ చేసిన విధానం, టైమింగ్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరును నిరుత్సాహపరిచేందుకే సీబీఐ అరెస్టు చేసి ఉండొచ్చని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదని, అందువల్ల కేజ్రీవాల్ని సీబీఐ అరెస్టు చేయడం సరికాదన్నారు. చిలుకను బంధించిన సీబీఐగా ఉన్న ముద్రను తొలగించుకోవాలని సూచించింది.


సీబీఐ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ తొలుత ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. కానీ సీబీఐ అరెస్ట్ సరైనదే అని కోర్టు పేర్కొంది. ఫలితంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏడాది కాలంగా ఈ లిక్కర్ స్కామ్ వార్తల్లో ఉంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలను ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారికి బెయిల్ లభిస్తోంది. బీఆర్ఎస్ నాయకురాలు కవిత కు ఇటీవలే బెయిల్ లభించిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement