Friday, November 22, 2024

Bail Rejected – జైలులోనే కేజ్రీవాల్ ….

బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
సీబీఐ కేసులో పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
ఊహ‌లు, క‌ల్ప‌న‌ల‌తో కేసు పెట్టార‌న్న న్యాయ‌వాది
సీబీఐ అరెస్ట్ అవ‌స‌రమే లేదంటూ వాద‌న‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూ ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే.. బెయిల్‌ పిటిషన్‌ సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ నాయయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, ఎన్‌ హరిహరన్‌, రమేశ్‌ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు చేయడం ‘ఇన్సురెన్స్‌ అరెస్ట్‌’ అని సింఘ్వీ వాదించారు. మద్యం పాలసీపై కేజ్రీవాల్‌తో పాటు అప్పటి ఎల్‌జీ అనిల్‌ బైజాల్‌ సైతం సంతకం చేశారని.. ఆ లాజిక్‌ ప్రకారం.. ఇందులో పాల్గొన్న మాజీ ఎల్‌జీ, బ్యూరోక్రాట్స్‌ని సైతం నిందితులుగా చేయాలన్నారు.

- Advertisement -

ఊహ‌లు, క‌ల్ప‌న‌లేన‌ని వాద‌న‌లు..

ఊహలు, కల్పనలతో పట్టుకునేందుకు యత్నిస్తున్నారన‌రి కేజ్రీవాల్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ ‘ఇన్సురెన్స్‌ అరెస్ట్‌’ కారణంగా మళ్లీ మొదటి దశకు వచ్చారన్నారు. కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్‌ అని చెప్పేందుకు, ఆయన ప్రమేయంపై ప్రత్యక్ష సాక్ష్యాలు సీబీఐ ఎస్‌ఎస్‌పీ తెలిపారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదని ట్రయల్‌ కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి బెయిల్‌పై విడుదలయ్యే అర్హత లేదని ఎస్‌ఎస్‌పీ సింగ్‌ పేర్కొన్నారు. ‘ఇన్సురెన్స్‌ అరెస్ట్‌’ అనే పదాన్ని ఉపయోగించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

ఆ నోటీసులు ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మేంటీ?

కేజ్రీవాల్‌కు సీబీఐ ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియ‌ర్ న్యాయ‌వాది సింఘ్వీ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్‌కు ఇటీవల బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జైలులో ఉన్న ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకొని విచారించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement