Friday, November 15, 2024

TG | టెంపుల్‌ టూరిజం కింద కీసరగుట్టను తీర్చిదిద్దుతాం : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : టెంపుల్‌ టూరిజం కింద కీసర గుట్టను వైభవోపేతంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ మేరకు కచ్చితమైన ప్రణాళికతో డీనీఆర్‌లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారుకుల మంత్రి కొండా సురేఖ ఆదేశాలిచ్చారు.

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని పరమేశ్వరుని సన్నిధిలో కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని మంత్రి కార్తీక దీపాలను వెలిగించి భక్తులతో కలిసి నీటిలో కార్తీక దీపాలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరమ పవిత్రమైన కార్తీకమాసంలో కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో దీపాలు వెలిగించడం దివ్యానుభూతిని ఇచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య భక్తులు కూడా భగవంతున్ని సంతృప్తిగా దర్శించుకుని వెళ్ళేలా కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. యాదాద్రి గుట్ట గోపురానికి బ్రహ్మోత్సవాల లోపు బంగారు తాపడం పనులను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి దేవాలయాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ప్రసాద స్కీమ్‌ ద్వారా సమకూరే నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాలను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తే సమాజం మంచి మార్గంలో పయనిస్తుందనే తలంపుతో సామూహిక కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారను. ఈ మేరకు మహిళలకు పూజా సామాగ్రిని, పసుపు కుంకుమలను అందిస్తాన్నామన్నారు.

- Advertisement -

ప్రాభవం కోల్పోతున్న కళలకు పునరుజ్జీవం కల్పించేందుకు ఈ మాసంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటుతున్నామని తెలిపారు. భజనలు, కీర్తనలు, ప్రవచనాలతో సమాజం సన్మార్గంలో పయనిస్తుందన్నారు. రాబోయే కార్తీక సోమవారాల్లో వైభవోపేతంగా కార్తీక దీపోత్సవాలను చేపడుతున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంత్‌ కొండిబా, ఆర్జేసి రామకృష్ణారావు, ఈవో సుధాకర్‌ రెడ్డి, ఛైర్మన్‌ నాగలింగం శర్మ, రంగంపేట పీఠాధిపతి మాధవానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement