కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరీశ్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, కలెక్టర్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి కళ్యాణమహోత్సవం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారులు, కోడల్లు, కుటుంబసభ్యులతో హాజరు కాగా.. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్‌లు దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణలతో పాటు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణలో రామలింగేశ్వరస్వామిని అందంగా అలంకరించారు. రామలింగేశ్వరస్వామి కళ్యాణం అనంతరం మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్‌లు ఆలయంతో పాటు పరిసరాలను పరిశీలించి మహాశివరాత్రి సందర్భంగా జరగనున్న ఏర్పాట్లను చూశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..