నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్-ఆంథోని తటిల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. సౌతిండియా సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేశ్ మెడలో మూడు ముళ్లు వేశాడు ఆంథోని తటిల్. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న కీర్తిసురేశ్ దంపతులకు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులిద్దరు మెరిసిపోయారు. కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. #ForTheLoveOfNyke హ్యాష్‌ట్యాగ్ జత చేసింది కీర్తిసురేశ్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటిస్తోన్న బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేశ్‌కు ఇది హిందీలో తొలి సినిమా.
- Advertisement -