Friday, November 22, 2024

Kedarnath | మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..

జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయం మే 10న తెరవనున్నట్లు బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ అజేంద్ర అజయ్‌ తెలిపారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను మే 10వ తేదీ ఉదయం 7గం.లకు తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద అజేంద్ర అజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. వేసవిలో తిరిగి గుడి తలుపులు తెరవడం ఆనవాయితీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement