Friday, November 22, 2024

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ తలుపులు..

కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్‌ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్‌ ఓంకారేశ్వర్‌ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సోమవారం తెలిపింది. యాత్రికులకు అవకాశం కల్పించడం లేదని, కేవలం ఆలయంలో ఆచారాలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొంది. పారిశుధ్యం పనులు పూర్తి, చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. ఇదిలా ఉండగా.. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఆచారాలతో తిరిగి తెరిచినట్లు సీఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ తెలిపారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని కేదారేశ్వరున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement