తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయిచంద్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.
ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఎదుట సాయి చంద్ భార్య బోరున విలపించింది. కేసీఆర్‌ను చూసి ఆమె దుక్కాన్ని తట్టుకోలేకపోయింది. ఏడుస్తున్న సాయి చంద్ భార్యను సీఎం కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ తోపాటు మంత్రి హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ నివాళులర్పించారు.
సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని పేర్కొన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి కంట తడి పెట్టారు. తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టకరమన్నారు.