తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని, ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఎలా కొంటారని ప్రశ్నించారు. సాధు జంతువులాంటి కాంగ్రెస్ను చంపి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అందుకే తాను పులి లాంటి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో లక్షల కోట్లు- దోచుకున్నారని ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement