Friday, November 22, 2024

TG | సుప్రీంలో కేసీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా

విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాగా, కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. అయితే, విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపడంతో పాటు.. ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్రప్రభుత్వం మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది.

అయితే కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952, విద్యుత్తు చట్టం-2003కి అది విరుద్ధమని.. దాన్ని రద్దుచేయాలని కేసీఆర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప.. దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement