రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి, క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను కేసీఆర్ ప్రార్థించారు. ఉగాది నుంచి కాలచక్రం తిరిగి మొదలవుతుంది. చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుంది. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభిస్తారు. అందుకే ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
- Advertisement -