ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో పునర్నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. మార్చి 28న గర్భాలయంలో కొలువై ఉన్న నారసింహుడి దర్శనాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా సీఎం కేసీఆర్ త్వరలో యాదాద్రిలో పర్యటించి పునర్నిర్మాణ పనులపై కీలక సూచనలు చేయనున్నారు. సంక్రాంతి తర్వాత మంచి రోజులను చూసుకొని పనుల పురోగతిపై మరోసారి యాదాద్రికెళ్లి… అక్కడి నుంచే ఉన్నతస్థాయి సమీక్షించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలోగా కొండమీద పూర్తిగా కట్టడాలను నిర్మించి పెండింగ్ పనులు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఆలయ గోపురాలపై కలశాల స్థాపనను వేదపండితులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందుకు దివ్యమైన ముహూర్తం దిశగా మహారాజగోపురం పనులను పరిశీలించేందుకు బృందాలు ఆలయ పరిసరాలను, పనులను సందర్శించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేయనున్నారు.
ఈ వారంలో క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు యాదాద్రిలో పర్యటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్ఘాటన పనుల ప్రారంభోత్సవాలు, మహాయాగానికి వసతులు, సౌకర్యాలు, వనరుల కల్పన, రుత్వికులకు సౌకర్యాలు, బసపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తులను ఆకర్షించేలా ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వెయ్యి సూట్లతో 250 కాటేజీల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మితమవుతోంది. రూ.6.90 కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జలమండలి సహకారంతో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థచ నీటి వసతి ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital