ఖమ్మం – దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ, దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు. భారత దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి ముప్పుగా తయారయ్యాయని అన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ పోరాట యోధులకు పుట్టినిల్లు అని రాజా అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం కనీస అవసరాలని, ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను తెలంగాణ అమలు చేస్తుందని కొనియాడారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement