Friday, November 22, 2024

కేసీఆర్ దండం పెట్టి మరీ అడిగారు.. ధాన్యం కొనకపోతే ఉద్యమం ఉద్ధృతం-ఎంపీ : నామా నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎండ‌న‌క‌, వాననక క‌ష్ట‌ప‌డి పండించిన వ‌రి పంట‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌క కొనాల్సిందేన‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భా ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రరావు డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో కేంద్రంపై కేంద్రం పై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఆయ‌న హెచ్చ‌రించారు. సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో ధాన్యం కోనుగోలుపై అవ‌లంభిస్తున్న ద్వంద వైఖ‌రికి నిర‌స‌న‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాలో ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ స‌భ్యుల‌తో నామ నాగేశ్వ‌రరావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి విధించిన డెడ్ లైన్ మేర‌కు, 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు సూచించారు. త‌మ నేత‌ దండం పెట్టి మ‌రీ కేంద్రాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నార‌ని గుర్తు చేశారు. కేంద్రం ఇప్ప‌టికీ స్పందించక‌పోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పుకొచ్చారు.

రైతు నిరసన దీక్ష అనంతరం ఢిల్లీలోని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అధికారిక నివాసంలో ప‌లువురు కీల‌క నేత‌లు మధ్యాహ్న భోజనం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీఆర్ఎస్ ఖ‌మ్మం జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టీడబ్ల్యూఆర్డీసీ చైర్మ‌న్ వి ప్రకాష్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వర్లు, చిత్తారు సింహాద్రి, ఆత్మ కమిటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement