హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై, పాలనా కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ”కూలుస్తం, పేలుస్తం అంటే.. ఊరుకుం టామా? మా వాళ్ళు కాళ్లు రెక్కలు విరిచి పడేస్తరు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివా రం శాసనసభలో మాట్లాడుతూ, కొత్త సచివా లయం, ప్రగతిభవన్‌లపై రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్‌ను పేల్చేస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా.. అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పనులు చేయా లనుకునేవారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారని సీఎం హెచ్చరించారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు.
ఇటీ-వల -పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతిభవన్‌ను బాంబులతో పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతిభవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు- పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కొత్త సచివాల యం గుమ్మటాలు కూల్చేస్తామని కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. భారతీయ, తెలం గాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. ప్రగతి భవన్‌ను ప్రజాదర్బార్‌గా మారుస్తామని బండి ప్రకటిం చారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సభలో స్పంది ంచిన సీఎం కేసీఆర్… రేవంత్, బండి సంజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.