Friday, November 22, 2024

న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ ప్రారంభం.. గర్భిణుల‌కు అంద‌జేసిన కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు-చేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు.

గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్‌ కిట్‌కు అనుబంధంగా వీటిని ప్రభుత్వం అందజేస్తోంది. మొదటి దశలో ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రారంభించారు. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్‌ కిట్‌ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చే మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

‘కిట్‌’లో 8 రకాల వస్తువులు

పోషకాహారా లోపాన్ని నివారించాలన్న ఉద్దేశంతో మొత్తం 8 రకాల వస్తువులను ప్రభుత్వం ఈ న్యూట్రిషన్‌ కిట్‌ ద్వారా అందిస్తోంది. మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్స్‌ ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్‌ రూ.250 కోట్లు కేటాయించారు. ఈ కిట్‌లో కిలో న్యూట్రిషన్‌ మిక్స్‌ పౌడర్‌, కిలో కర్జూర, 3 ఐరన్‌ సిరప్‌ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్‌ బాటిల్‌ ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement